
తాళం వేసిన ఇంట్లో చోరీ
కుంటాల: మండలకేంద్రంలో తాళం వే సిన ఇంట్లో గుర్తుతెలి యని దొంగలు చోరీ కి పాల్పడ్డారు. స్థాని కుల కథనం ప్రకా రం.. కుంటాలకు చెందిన సక్రపు సురేష్ దంపతులు శుక్రవారం సాయంత్రం పని నిమిత్తం నిర్మల్ వెళ్లారు. పక్కింటివారు శనివారం సాయంత్రం తలుపులు తెరిచి ఉండడంతో వారికి సమాచారం అందించారు. బీరువాలో రూ.10వేల నగదుతోపాటు 4 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. రూ.40 వేల విలువ గల వెండిని వదిలేసి వెళ్లారు. పక్క గదిలోనే టీజీబీ బ్యాంకులో పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ అద్దెకు ఉంటున్నాడు. ఆ గది తాళం పగులగొట్టి వస్తువులను చిందరవందర పడేశారు. నిర్మల్ నుంచి క్లూస్ టీం సిబ్బంది వచ్చి సేకరించారు. ఎస్సై అశోక్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు సురేష్ ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.