
పటిక, బెల్లం పట్టివేత
దండేపల్లి: మండలంలోని నె ల్కివెంకటాపూర్‌లో అత్తె గంగా ధర్ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వచేసిన 240 కిలోల పటిక, 60 కిలోల నల్లబెల్లం పట్టుకున్నట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉమ్మడి జిల్లా సీఐ గంగారెడ్డి తెలిపారు. షాపు నిర్వాహకుడు గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని, పటిక బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం లక్సెట్టిపేట ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితుడిని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం బైండోవర్ చేసినట్లు లక్సెట్టిపేట ఎకై ్సజ్ ఎస్సై మౌనిక వెల్లడించారు.