
నేడు ప్రజాపాలన దినోత్సవం
మంచిర్యాలఅగ్రికల్చర్/నస్పూర్: జిల్లా కేంద్రంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు హాజరు కానున్నారు. మంగళవారం రాత్రి శ్రీరాంపూర్‌లోని సింగరేణి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ కుమార్ దీపక్ స్వాగతం పలికారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఆర్‌డీఓ శ్రీనివాసరావు, ఏసీపీ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 9.45 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుంటారు. 10 గంటలకు జాతీయ జెండావిష్కరణ, తదితర కార్యక్రమాలు ఉంటాయి.