
గిన్నీస్ రికార్డు లక్ష్యంగా దేశ పర్యటన
మంచిర్యాలటౌన్: కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ బెంగళూరుకు చెందిన దివాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణ, మొక్కల పెంపు లక్ష్యంగా మోటారుసైకిల్‌పై దేశ పర్యటన చేపట్టారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ 2023 నవంబర్ 1న పర్యటన ప్రారంభించి ఇప్పటి వరకు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 806 జిల్లాలు చుట్టొచ్చినట్లు తెలిపారు. రెండు లక్షల కిలోమీటర్ల వరకు ప్రయాణించాలని లక్ష్యం పెట్టుకున్నానని, గతంలో 1.40 లక్షల కిలోమీటర్లు బైక్‌పై దేశపర్యటన చేసిన గిన్నీస్ రికార్డును అధిగమిస్తానని తెలిపారు. 92 వేల కిలోమీటర్ల ప్రయాణం పూర్తయిందని, రూ.9 లక్షల వరకు ఖర్చు కాగా, తన లక్ష్యం నెరవేరేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు.