
● నిజాం సర్కారు గుండెల్లో ఫిరంగుల మోత ● అప్పటి గవర్నర్
అద్దాల మేడ మూడంతస్తుల భవనం. దీనిపైకి ఎక్కితే చుట్టూ 15కిలోమీటర్ల మేర కనిపిస్తుండడంతో శత్రువుల రాకను సైనికులు కనిపెట్టేవారు.
భవనం లోపలి నుంచి సుమారు 10కిలోమీటర్ల మేర సొరంగం ఉందని, దీని ద్వారానే సైనికులకు ఆయుధాలు చేరేవని ప్రచారంలో ఉంది. ఇక్కడి నుంచి పోరాడిన ఇండియన్ మిలిటరీ సైనికుల్లో సుమారు 211మంది స్వాతంత్య్ర సంగ్రామంలో తుదిశ్వాస విడిచారు. వేలాది మంది రజాకార్లను మట్టికరిపించారు. అద్దాల మేడ సైనిక నీడకు ప్రతిరూపంగా పేరొందింది.
చెన్నూర్, నస్పూర్, కోటపల్లి మండలాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు ఇండియన్ మిలటరీ సైనికులకు రజాకార్ల కదలికలపై సమాచారం చేరవేసేవారు.
సైనికులు వాడిన ఫిరంగులు కాలగర్భంలో కలిసిన ఆనవాళ్లు నేటికీ కనిపిస్తాయి.
చెన్నూర్: నాడు నిజాం సర్కారు నియంతృత్వ పాలనను అంతమొందించేందుకు మిలిటరీ దళాలు మహారాష్ట్రలోని సిరొంచలో ఉన్న అద్దాల మేడను స్థావరంగా చేసుకున్నాయి. ఇక్కడి నుంచే ఫిరంగుల మోత మోగించాయి. కోటపల్లి మండలం రాపన్‌పల్లికి మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాణహిత నది అవతలి ఒడ్డున సిరొంచలో అద్దాల మేడ ఉంది. 1901లో బ్రిటీష్ కాలంలో అప్పటి కలెక్టర్ గ్లాస్ ఫోర్డ్ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని సిరొంచ ప్రాణహిత నది ఒడ్డున నిర్మింపజేశారు. ఇండియన్ మిలిటరీ సైనికులు అద్దాల మేడను స్థావరంగా చేసుకుని నిజాం సర్కారుపై పోరాటం సాగించారు. ఆనాడు నిజాంపై పోరాడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు అద్దాల మేడలో తలదాచుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచే మిలిటరీ సైనికులు హైదరాబాద్‌లోని నిజాం సర్కారుపై పోరాటానికి వ్యూహారచన చేశారని చెప్తుంటారు. ఆనాడు కలెక్టర్, గవర్నర్ బంగ్లాగా అద్దాలమేడను వినియోగించేవారు.
జిల్లా కేంద్రంగా..
ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సిలో అప్పర్ గోదావరి జిల్లా కేంద్రంగా సిరొంచా ఉండేది. సిరొంచా జిల్లా పరిధి అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని భద్రాచలం, ఖమ్మం, ఏటూరునాగారం, కరీంనగర్, మరోవైపు జన్నారం, లక్సెట్టిపేట వరకు విస్తరించి ఉంది. స్వాతంత్య్రం అనంతరం రాష్ట్రాల విభజన తర్వాత భద్రాచలం, ఖమ్మం, ఏటూరునాగారం, కరీంనగర్, జన్నారం, లక్సెట్టిపేట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. సిరొంచ మహారాష్ట్రలో భాగమైంది.
ఇవీ విశేషాలు..
గవర్నర్ బస..
1947లో మద్రాసు గవర్నర్ పట్టాభి సీతారామయ్య ఈ భవనంలో బస చేశారు. హైదరాబాద్ నిజాం సర్కార్‌తో చర్చలు జరపడానికి అప్పటి హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ అద్దాల మేడకు వచ్చినట్లు సమాచారం. పీవీ నరసింహారావు సైతం అద్దాల మేడను సందర్శించిన ప్రముఖల్లో ఉన్నారు. ఉద్యమ కేంద్రంగా ప్రధాన భూమిక పోషించి మరాఠీ, హిందీ, తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన ఈ అద్దాలమేడ నేడు పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
మిలిటరీ స్థావరం.. అద్దాల మేడ