
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జైపూర్: మండలంలోని ఇందారం గ్రామానికి చెందిన పత్తి రాజ్‌కుమార్(33) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించగా చిక్సిపొందుతూ గోదావరిఖని ఆస్పత్రిలో బుధవారం మృతిచెందాడు. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కూలీ పని చేస్తూ జీవించే రాజ్‌కుమార్ కొన్ని రోజులుగా ఖాళీగా ఇంటి వద్ద ఉంటున్నాడు. పనికి వెళ్లాలని భార్య మానస, తల్లిదండ్రులు సూచించారు. ఇదే విషయంలో భార్యాభర్తల తరచూ గొడవలు జరిగేవి. గత నెల 20న భార్యతో గొడవపడి ఇంట్లో గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. అక్కడి నుంచి మళ్లీ ఈ నెల 10న గోదావరిఖని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య మానస, కూతురు శ్రీశ్వ, కుమారుడు శ్రీహాన్ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఏస్సై హాబీబ్ తెలిపారు.