
గోదావరిలో పెరుగుతున్న వరద
బాసర: ఎగువన కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్ పర్బాని జిల్లా పరిధిలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో గోదావరినదిలోకి భారీ గా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో నదీతీరంలోని స్నానఘట్టాల వద్దకు భక్తులను అనుమతించడం లేదు. ఆలయం నుంచి గోదావరి నదికి ఉండే మార్గంలో వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల, రెవెన్యూ అధికారులు గోదావరి నది వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
మళ్లీ వరదనీరు
బాసరలో 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓనీ, కౌట, సావర్గాం, సాలాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారులు గోదావరి బ్యాక్‌వాటర్‌తో నిండి రాకపోకలు నిలిచిపోయాయి.

గోదావరిలో పెరుగుతున్న వరద