
రాయితీ సిలిండర్లు పట్టివేత
వాంకిడి(ఆసిఫాబాద్): హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వినియోగిస్తున్న రాయితీ సిలిండర్లను పట్టుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రాజ్‌కుమార్, శ్రీనివాస్ బు ధవారం తెలిపారు. వాంకిడి మండల కేంద్రంలోని తెలంగాణ హోటల్, నేచర్ టీ స్టాల్, రి యాజుద్దీన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఫ్రెండ్స్ విల్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, పాడ్యావర్చా చాహా టీ స్టా ల్‌లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగ రాయితీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.