
‘కార్మికులను వేధిస్తున్న గని మేనేజర్’
మందమర్రిరూరల్: ఏరియాలోని కేకే–5 గనిలో ఇష్టానుసారంగా కార్మికులకు లెటర్లు పంపిణీ చేస్తూ గని మేనేజర్ వేధింపులకు గురిచేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. బుధవారం కేకే–5 వద్దకు చేరుకున్న పలు కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన కార్మికులను కలుసుకుని వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం గని సేఫ్టీ ఆఫీసర్ రమేష్‌తో మాట్లాడగా గని మేనేజర్ అందుబాటులో లేరని, వచ్చాక మాట్లాడుదామని నచ్చజెప్పడంతో కార్మికులు యధావిధిగా విధుల్లోకి వెళ్లారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎమ్మెస్ నాయకులు పాల్గొన్నారు.