
వాస్తు శిల్పి పితామహుడు విశ్వకర్మ
● ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు
మంచిర్యాలఅగ్రికల్చర్: వాస్తు శిల్పి, ప్రతిమ శాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం, విజయ్‌కుమార్, రమేష్, కస్తూరి శ్రీనాథ్‌చారి, రావుల హరీష్‌చారి, తదితరులు పాల్గొన్నారు.