
ఘనంగా విమోచన దినోత్సవం
మంచిర్యాలటౌన్/చెన్నూర్: మంచిర్యాల, చెన్నూర్‌లోని బీజేపీ కార్యాలయాల్లో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తాకట్టు పెట్టిన గొప్ప పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినో త్సవం అధికారికంగా నిర్వహిస్తామని అన్నా రు. చెన్నూర్‌లోని ఎస్‌ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, కమలాకర్‌రావు, పట్టి వెంకటకృష్ణ, తుమ్మ శ్రీపాల్, నాయకులు పాల్గొన్నారు.