
అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు
చెన్నూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. స్థానిక సీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో అనితతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సీ్త్ర.. శక్తివంతమైన కుటుంబం కోసం జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణులు మహిళలు, యువతులు, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పర్యవేక్షకులు కోటేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమాధికారి రౌవూఫ్‌ఖాన్, వైద్యులు సత్యనారాయణ, ప్రపాద్, కృపాబాయి, భీష్మ, శ్రీధర్, సుధాకర్‌నాయక్, హరిచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఉత్తమ ఈఎంటీలకు అవార్డులు
చెన్నూర్ 108 అంబులెన్స్ ఈఎంటీ పోచన్న, వేమనపల్లి ఈఎంటీ జాడి స్వరూప, మంచిర్యాల 102 సర్వీసులో పని చేస్తున్న కెప్టెన్ శంకర్‌లకు బుధవారం చెన్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఉత్తమ అవార్డులు అందజేశారు. రాష్ట్రంలోనే 108 సేవల్లో చెన్నూర్, వేమనపల్లి మండలాలు ప్రథమ స్థానంలో నిలిచాయని కలెక్టర్ తెలిపారు. అవార్డులు అందుకున్న ఈఎంటీలను రాష్ట్ర 108 కార్యాలయ ప్రధానాధికారి కిశోర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, మంచిర్యాల కార్యనిర్వహణాధికారి సంపత్, వైద్యులు అభినందించారు.