
ఇద్దరు పిల్లలూ..
జన్నారం మండలం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో చౌహాన్ కాంత, కిష్టాపూర్ జెడ్పీ పాఠశాలలో ప్రకాశ్ బానోత్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్యాభర్తలైన వీరిద్దరు ఇద్దరు పిల్లలను స ర్కారు బడిలోనే చేర్పించారు. దండేపల్లిలో పని చేస్తున్నప్పుడు ప్రకాశ్ బానోతు కూతురు శ్రీనిధిని దండేపల్లి జెడ్పీ పాఠశాలలో చదివించగా 2023లో ఎస్సెస్సీలో టాపర్‌గా నిలిచింది. పరిస్థితులు అనుకూలించక కుమారుడు సాత్విక్‌నాయక్‌ను ప్రైవేటు స్కూల్లో చదివించారు. కిష్టాపూర్‌కు బదిలీపై రాగానే కుమారుడిని ఎనిమిదో తరగతిలో చేర్పించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. ‘నేను పాఠాలు బోధిస్తున్న పాఠశాలలోనే చక్కటి బోధన ఉంటుందనే ఉద్దేశంతో ఇద్దరు పిల్లలను చదివించడం ఎంతో అనుభూతి ఉంటుంది..’ అని ప్రకాశ్ తెలిపారు.