
యూరియాపై ఆందోళన వద్దు
వేమనపల్లి: యూరియా నిల్వలు లేవని రైతులు ఆందోళన చెందకూడదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఛత్రునాయక్ అన్నారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు అన్ని ఫర్టిలైజర్, పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాల్లో నిల్వ ఉన్నాయని తెలిపారు. మండలంలోని నీల్వాయి, ముల్కలపేట, గొర్లపల్లి, సుంపుటం గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా అమ్మకాల తీరును పరిశీలించారు. రశీదులు, నిల్వల రిజిష్టర్ పరిశీలించారు. ప్రతీ రైతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిష్టర్‌లో తప్పక పేరు నమోదు చేయించుకోవాలని, అలాగైతేనే పీఎం కిసాన్‌కు అర్హులని తెలిపారు. ఏఓ వీరన్న, ఏఈఓలు రుక్సార్ సుల్తానా, ఎఫ్సిబా పాల్గొన్నారు.