
విద్యార్థులు క్రీడల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి
కాసిపేట: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని ఇంటర్మీడియెట్ విద్యాధికారి(డీఐఈవో) అంజయ్య సూచించారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం సమయసారిణిలో ప్రతీ శనివారం కాలేజీ విద్యార్థుల ఆటలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. క్రీడలు ప్రారంభించి క్రీడాసామగ్రి అందజేశారు. ప్రతీరోజు వ్యాయామం, క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్, పీడీ బాబురావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.