
సీతాకోక చిలుకలు, పక్షులపై అధ్యయనం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోని పాత మంచిర్యాల అటవీ బీట్, ఎంసీసీ క్వారీ అడవిలోని గాంధారీ ఖిల్లా జంగల్ సఫారీలో శనివారం సీతాకోక చిలుకలు, పక్షులపై అధ్యయనం చేశారు. మహారాష్ట్రకు చెందిన వైల్డ్ లైఫ్ వార్డెన్ డాక్టర్ రంజన్ విరనీ, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయనంలో 30 రకాల సీతాకోక చిలుకలు, వివిధ రకాల పక్షులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట రేంజ్ పరిధిలోని ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు, వన ప్రేమికులు పాల్గొన్నారు.