
సీఆర్‌టీల నియామకం చేపట్టాలి
కాసిపేట: జిల్లాలో సీఆర్‌టీల నియమాకం చేపట్టాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి సమస్య వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఆర్‌టీల నియామకం చేపడుతుండగా, జిల్లాలో పోస్టులు లేవని, దరఖాస్తులు చేసుకోవద్దని బోర్డు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలో ఒక్క ఎస్జీటీ పోస్టు సైతం ఖాళీ లేదా అధికారులు సమాధానం చెప్పాలని, వెంటనే ఖాళీల వివరాలు ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడ జంగు, ఆదివాసీ నాయక్‌పోడ్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న, పెంద్రం హన్మంతు, పెద్ది భార్గవ్, మడావి అనంతరావు, ఆత్రం జంగు, సండ్ర భూమన్న తదితరులు పాల్గొన్నారు.