
వైద్య విద్యార్థికి ఆర్థికసాయం
చెన్నూర్‌రూరల్: మండలంలోని రాయిపేట గ్రామానికి చెందిన దుర్గం రంజిత్ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుకునేందుకు ఆర్థిక ంగా కష్టాలు పడుతున్నాడు. సాక్షి మెయిన్ పేజీలో ఈనెల 6న ‘డాక్టర్ కలకు ఆర్థిక కష్టాలు’శీర్షికన ప్రచురితమైన కథనానికి మాజీ వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి స్పందించారు. రంజిత్ వైద్యవిద్యకోసం తల్లిదండ్రులు కిష్టయ్య, చిన్నక్కలకు ఆదివారం రూ.25 వేల ఆర్థికసాయం చేశారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దామోదర్‌రెడ్డి, మాజీ రైతు సమన్వయసమితి అధ్యక్షులు రత్నసమ్మిరెడ్డి పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రం పరిశీలన
బోథ్: సొనాల మండలంలోని గుట్టపక్కతండా గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సరుకులు కాలం చెల్లిపోగా, గుడ్లు, ఇతర పదార్థాలు కుళ్లిపోయాయి. ‘అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు, సరుకులు’శీర్షికన సాక్షిలో ఆదివారం ప్రచురితమైన కథనానికి జిల్లా మహిళా శిశు, సంక్షేమ అధికారి మిల్కా, సీడీపీవో వినూత్న స్పందించారు. ఆదివారం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. 15 రోజులకు సరిపడా సరుకులను లబ్ధిదారులకు అందించారు. కేంద్రం ఇన్చార్జిని మార్చినట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్‌తోపాటు ఆయాపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వైద్య విద్యార్థికి ఆర్థికసాయం

వైద్య విద్యార్థికి ఆర్థికసాయం

వైద్య విద్యార్థికి ఆర్థికసాయం