ఐటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
మంచిర్యాలటౌన్: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ చార్జిషీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని ఐటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురా లు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను మానుకుని ప్రజాక్షేత్రంలో పోరాడాలని హితవు పలికారు. ధర్నాను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అధికసంఖ్యలో కాంగ్రెస్ నా యకులు పాల్గొని ఆందోళన కార్యక్రమాన్ని
విజయవంతం చేశారు.


