ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోదీ భేటీ

PM Narendra Modi to chair meeting with CM of all states on Today - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై వారితో విస్తృతంగా చర్చించనున్నారు. కరోనా టీకా సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ అనే టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో భేటీ అవుతుండడం ఇదే తొలిసారి. వ్యాక్సినేషన్‌ సన్నద్ధతలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు దఫాలు డ్రై రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. మొదట కోటి మంది ఆరోగ్య  సిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోసు ఇస్తామని ప్రకటించింది. అంటే కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న 27 కోట్ల మందికి ముందుగా టీకా అందనుంది.

Read latest Maharashtra News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top