కబ్జాలను తొలగించేందుకు అధికారుల యత్నం | - | Sakshi
Sakshi News home page

కబ్జాలను తొలగించేందుకు అధికారుల యత్నం

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

జడ్చర్ల: స్థానిక కొత్త బస్టాండ్‌ సమీపంలో ఓ హోటల్‌ నిర్వాహకులు రోడ్డును ఆక్రమించారన్న ఫిర్యాదులపై దానిని తొలగించేందుకు మున్సిపల్‌ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. దీంతో హోటల్‌ యజమాని యజాజ్‌, కుటుంబ సభ్యులు జేసీబీని అడ్డుకుని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎస్‌ఐ ఖాదర్‌, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా హోటల్‌ కొనసాగిస్తున్నామని, మున్సిపల్‌ అధికారులు ఇప్పుడు వచ్చి ఆక్రమణ పేరుతో తొలగించడం ఏమిటని వారు ప్రశ్నించారు. కాగా హోటల్‌ ముందు ఉన్న రోడ్డుపై సీసీ నిర్మాణం చేస్తున్నందున ఆక్రమణలను తొలిగించే చర్యలు చేపట్టినట్లు కమిషనర్‌ గిరీష్‌ తెలిపారు. గతంలోనూ ఈ హోటల్‌ ఆక్రమణపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై హోటల్‌ యజమానికి నోటీసు ఇచ్చామని, వారు ఆక్రమణను తొలగించకపోతే తామే తొలగించి సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతామని స్పష్టం చేశారు. కాగా బుధవారం కావేరమ్మపేటలో ఈద్గా అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని నిలదీసినందుకే తమ హోటల్‌ను కూల్చే ప్రయత్నం చేశారని బాధితులు ఆరోపించారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన

హోటల్‌ యజమాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement