ఎర్రవల్లి నిర్వాసితుల ముందస్తు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎర్రవల్లి నిర్వాసితుల ముందస్తు అరెస్ట్‌

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

చారకొండ: డీఎల్‌ఐ లిప్టు ఇరిగేషన్‌ నిర్మాణంలో భాగంగా మండలంలోని గోకారం జలాశయం కారణంగా ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఆయ గ్రామాల నిర్వాసితులు తమ గ్రామాలను మినహాయించి సామర్ధ్యం తగ్గించాలని, ఆర్‌అండ్‌ఆర్‌ను రద్దు చేయాలని చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 360 రోజులు చేరుకున్నాయి. గురువారం అచ్చంపేటలో సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగ సభను అడ్డుకుంటారని సమాచారం అందడంతో వెల్దండ పోలీసులు ఎర్రవల్లికి చేరుకొని ముందస్తుగా నిర్వాసితులను హౌస్‌ అరెస్టులు చేశారు. మరి కొంత మంది దీక్ష శిబిరంలో ఉండటంతో వారు ఎక్కడి వెళ్లకుండా బందోబస్తు నిర్వహించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామని నిర్వాసితులు పేర్కొన్నారు. ఎన్ని నిర్భందాలు చేసినా దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముంపు గ్రామాల నిర్వాసితులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement