స్కూటీని ఢీకొట్టిన లారీ: రైతు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొట్టిన లారీ: రైతు దుర్మరణం

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

అడ్డాకుల: 44వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం.. జడ్చర్ల మండలంలోని కోడ్గల్‌ గ్రామానికి చెందిన దేవకమ్మ, గోపాల్‌రెడ్డి (59) దంపతులు. వీరి కుమార్తె సరితను పొన్నకల్‌ చెందిన రాజవర్ధన్‌రెడ్డితో వివాహం జరిపించారు. అనంతరం గోపాల్‌రెడ్డి దంపతులు ఏడేళ్ల క్రితం వీరు కోడ్గల్‌ను వదిలి పొన్నకల్‌లో ఉండే తమ కుమార్తె వద్దకు వచ్చి, వారి ఇంట్లోనే నివాసముంటున్నారు. అక్కడే కొంత భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారు. దీంతోపాటు కందూర్‌ వద్ద కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తుండగా.. గురువారం సాయంత్రం గోపాల్‌రెడ్డి స్కూటీపై అక్కడికి బయ లు దేరాడు. పొన్నకల్‌ స్టేజీ వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిని దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోపాల్‌రెడ్డిని స్థానికులు అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మురళి తెలిపారు.

15 రోజుల్లో ఇద్దరు..

పొన్నకల్‌ స్టేజీ వద్ద ప్రమాదాల సంఖ్య పెరగడం వాహనదారులను, ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నెల 11న పొన్నకల్‌ గ్రామానికి చెందిన మహిళ కేశమ్మ మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చి ఇక్కడే రోడ్డు దా టుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందింది. కేవలం 15 రోజుల వ్యవధిలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు రోడ్డు దాటుతూ మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇక్కడ అండర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చాలా రోజులుగా గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement