మా పూర్వీకులు రాజుల కాలం నుంచి ఏ నియమాలతో అయితే కురుమూర్తిస్వామిని సేవించారో.. నేటికీ మేం అదే పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధతను ప్రాణప్రదంగా కాపాడుతున్నాం. ఇది ఆ శ్రీనివాసుడు ప్రసాదించిన పూర్వజన్మ సుకృతం. మా తరం తర్వాత కూడా ఈ ఆగమ వైభవం ఇదే పవిత్రతతో కొనసాగాలన్న ఉద్దేశంతో మా పిల్లలకు శాస్త్రజ్ఞానాన్ని అందిస్తున్నాం. కొండపైకి వచ్చే ప్రతి భక్తుడికి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలన్నదే మా సంకల్పం.
– ఎన్.వెంకటయ్య ఆచార్యులు,
ముఖ్య అర్చకులు, శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం


