నగర హెడ్‌కానిస్టేబుల్‌కు ఉత్కృష్ట సేవా పతకం | - | Sakshi
Sakshi News home page

నగర హెడ్‌కానిస్టేబుల్‌కు ఉత్కృష్ట సేవా పతకం

Nov 27 2026 1:26 AM | Updated on Nov 27 2026 1:26 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: మహబూబ్‌నగర్‌ నగరంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం హెడ్‌కానిస్టేబుల్‌ జి.రామచంద్రయ్యకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్కృష్ట సేవా పతకాన్ని ప్రకటించింది. రక్షణ దళంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. గురువారం తెలంగాణ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య చేతుల మీదుగా రామచంద్రయ్య ఈ పతకాన్ని అందుకున్నారు.

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: రైతు వ్యతిరేక చట్టాల రద్దుతో పాటు కార్మిక నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎ.రాములు డిమాండ్‌ చేశారు. ఎస్‌కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్‌పీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి బహిరంగ మార్కెట్‌ విధానం ద్వారా కార్పొరేట్‌ కంపెనీలకు రైతులను తాకట్టు పెట్టేలా కాంట్రాక్ట్‌ వ్యవసాయాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం, సీఐటీయూ నాయకులు లక్ష్మయ్య, చంద్రకాంత్‌, వెంకటయ్య, శ్రీనాథ్‌, సురేష్‌, వీరన్న, వేపూరు వెంకటయ్య, నందు పాల్గొన్నారు.

సివిల్స్‌ మెయిన్స్‌ అర్హులకు ఉచిత ఇంటర్వ్యూ గైడెన్స్‌

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌–2026లో అర్హత సాధించిన మైనార్టీ అభ్యర్థులకు ఉచిత ఇంటర్వ్యూ గైడెన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎం.ఛత్రు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మైనార్టీస్‌ స్టడీ సర్కిల్‌, కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ (హైదరాబాద్‌) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో ఉచిత మాక్‌ ఇంటర్వ్యూలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో అందించనున్నట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు మెయిన్స్‌ హాల్‌టికెట్‌/రోల్‌ నంబర్‌, డీఏఎఫ్‌–1, డీఏఎఫ్‌–2, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో అవసరమని తెలిపారు. ఆన్‌లైన్‌లో tgmonoritiesstudycircle.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 040–23236112, 9059050062 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. జిల్లాలోని అర్హులైన మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్మిక వ్యతిరేక విధానాలు విరమించుకోవాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: కార్మికుల భవిష్యత్తును, ఉద్యోగ భద్రతను దెబ్బతీసే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విర మించుకోవాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షు డు వీరాంజనేయులు, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌ డిపో ఎదురుగా నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో వారు మాట్లాడారు. ఈ విధానాలతో ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా సంస్థలు ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయన్నారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా కుదించి, కార్మిక హక్కులను హరించే యత్నం చేస్తున్నా రని ఆరోపించారు. ఈ కోడ్‌ల అమలుతో కార్మిక సంఘాల కార్యకలాపాలపై ఆంక్షలు విధించడంతో పాటు సమ్మె చేసే హక్కు సైతం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించి ఢిల్లీలో జరగబోయే ధర్నాకు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. అనంతరం వచ్చే నెల 1 నుంచి 3వ తేదీ వరకు ఢిఢిల్లీలో జరగనున్న ఆందోళనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయా సంఘాల నాయకులు ఎం.ప్రభాకర్‌, కోట్ల శ్రీనివాస్‌గౌడ్‌, వి.రామచందర్‌, ఖమరలీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement