● రూ.60 వేల లంచం తీసుకుంటూపట్టుబడిన అవినీతి అధికారి
గద్వాల: విద్యుత్ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన అవినీతి అధికారిని ఏసీబీ వలపన్ని పట్టుకుంది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వివరాల మేరకు.. జిల్లా విద్యుత్‌శాఖలో ఏడీఈగా అన్నారపు రమేశ్‌బాబు విధులు నిర్వహిస్తున్నారు. అదే శాఖలో విద్యుత్ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు రూ. 12,62,070 బిల్లు రావాల్సి ఉంది. అయితే తనకు అడిగనంత లంచం ఇస్తేనే బిల్లు చేస్తానని ఏడీఈ రమేశ్‌బాబు సదరు కాంట్రాక్టర్‌ను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఏడీఈ రమేశ్‌బాబు గురువారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో విద్యుత్‌శాఖ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్టర్ నుంచి రూ. 60వేలు లంచం డబ్బులు తీసుకుని తన కారులోని డ్యాష్ బోర్డులో పెట్టుకున్నాడు. అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు.. వెంటనే రమేశ్‌బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. లంచం రూపంలో డబ్బులు తీసుకున్నాడని నిర్ధారణ కావడంతో అతడిపై అవినీతి సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం రమేశ్‌బాబును నాంపల్లి కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉండటంతో భద్రతా కారణాల రీత్యా పూర్తి వివరాలు వెల్లడించడం సాధ్యంకాదని డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని.. లేదా 9440446106 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామన్నారు. అవినీతిలేని సమాజం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.


