● డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
● జిల్లాకేంద్రంలో సంవిధాన్ రక్షక్ మార్చ్
స్టేషన్ మహబూబ్‌నగర్: భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణే లక్ష్యంగా కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అనుప శేఖర్ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షక్ మార్చ్ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఎర్రసత్యం చౌరస్తా, తెలంగాణ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు సంవిధాన్ రక్షక్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో భారీసంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలదరికీ కల్పించిన ప్రాథమిక హక్కులు, స్వేచ్చ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి యువత కీలకపాత్ర పోషించాలన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్ అహ్మద్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ, రాష్ట్ర కార్యదర్శులు నరేష్ యాదవ్, నరేష్ యాదవ్, నాయకులు శ్రుతిరెడ్డి, గోనెల శ్రీనివాస్, ఇమాద్, సర్దాజ్ ఖాద్రీ, అబూబకర్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.


