పండగ సాయన్న.. అందరివాడు | - | Sakshi
Sakshi News home page

పండగ సాయన్న.. అందరివాడు

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

● జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం

● రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

● నవాబ్‌పేటలో అట్టహాసంగా విగ్రహావిష్కరణ

నవాబుపేట: ప్రజల ఆకలి తీర్చేందుకు.. పెత్తందారుల దోపిడీని అరికట్టేందుకు.. కొత్త పంథాను ఎంచుకుని పేదల ఆకలి తీర్చిన మహాయోధుడు, తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండగల సాయన్న చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో నవాబుపేటలో ఏర్పాటు చేసిన పండగ సాయన్న విగ్రహాన్ని మంత్రి వాకిటి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని మంత్రిగా తాను వినతిపత్రం పెట్టిన వారం రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు తీర్మానం చేసి జీఓ జారీ చేశారని వివరించారు. ఈ క్రమంలోనే ఈ నెల 22న రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం నిర్వహిస్తుందని, ఆ తర్వాత డిసెంబర్‌ 10న జయంతిని జరుపుకోనున్నట్లు వెల్లడించారు. ఇది ప్రజావీరుడికి ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక గౌరవం అన్నారు. ఇదే స్ఫూర్తితో మదిరాజ్‌లను బీసీ డీలో నుంచి బీసీ ఏలో చేర్చేలా కృషి చేస్తానన్నారు. అలాగే శాసన మండలి వైస్‌ చైర్మన్‌ బండ ప్రకా్‌ష్‌, ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జానేశ్వర్‌ మాట్లాడుతూ చట్టసభల్లో ముదిరాజ్‌లకు తగిన ప్రాతినిథ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పండగ సాయన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, ఇదే నెలలో జడ్చర్లలో పండగ సాయన్న విగ్రహం ఆవిష్కరిస్తామని ప్రకటించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పండగ సాయన్న పోరాట పటిమ చాలా గొప్పదని అభిప్రాయపడ్డారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.

తరలివచ్చిన అభిమానులు

నవాబుపేటలో ఏర్పాటు చేసిన పండగ సాయన్న కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా ముదిరాజ్‌ సమాజం, పండగ సాయన్న అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డప్పుల విన్యాసాలు, జానపద గీతాలాపనలు, బాణసంచా పేలుళ్లు, సన్మానాలతో కార్యక్రమం హోరెత్తింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌, నాయకులు అందె బాబయ్య, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, కృష్ణ, కార్యక్రమ నిర్వాహకులు నర్సింహులు, శ్రీనివాస్‌, లింగం, నర్సింహులు, ఇందిరాదేవి, శ్రీనివాస్‌, నవాబుపేట సర్పంచ్‌ గీతారాణి, రాంమనోహర్‌రాజు, ప్రతాప్‌, బృంగి రవి, రాజే్‌ష్‌, సత్యం, అంజయ్య, నర్సింహులు, కుమార్‌, లక్ష్మయ్య, నరేష్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement