కొల్లాపూర్: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి తీరుతామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుహౌజ్లో రెండు బహుమలి మోటార్లను బుధవారం ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా స్వీచ్యార్డులోని ప్యానల్ బోర్డులో పూజలు చేశారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు విలేకర్లతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తిచేసి, రైతాంగానికి సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ.. ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభించిన మోటార్ల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోయనున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయకుండానే జాతికి అకింతం చేశారని విమర్శించారు. అప్పుడే ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం మేరకు సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
● ఇదిలా ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా నీటి విడుదల కేవలం 2.15 గంటలు మాత్రమే కొనసాగింది. విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో నీటిపంపింగ్ను సాయంత్రం 5.30 గంటలకే అధికారులు నిలిపివేశారు. దీనిపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మ ధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి.
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
‘పాలమూరు’ మోటార్ల ప్రారంభం.. సాంకేతిక సమస్యతో
రెండు గంటల్లోనే నిలిపివేత


