చెరువులో పడి వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వృద్ధుడు మృతి

Oct 13 2026 12:47 AM | Updated on Oct 13 2026 12:47 AM

బల్మూర్‌: చేపలు పట్టడానికి వెళ్లిన వృద్ధుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం బాణాల గ్రామానికి చెందిన పంబ చెన్నయ్య(60) గ్రామ శివారులో ఉన్న బాబాయికుంటలో చేపలు పట్టడానికి వెళ్లాడు. చేపలకోసం వల వేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి మృతి చెందాడు. సోమవారం ఉదయం 8 గంటలకు కుంటగట్టుపై మృతుడి చెప్పులు, వల కనిపించడంతో స్థానికులు చెరువులో గాలించగా మృతదేహం బయటపడింది. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు పంబ శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

మల్దకల్‌: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండలంలోని దాసరపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మహేశ్వరి(30) కూలీ పనులు చేసుకుంటూ కుటుంభాన్ని పోషిస్తోంది. ఇటీవలే అనారోగ్యం బారిన పడి ఆర్థిక ఇబ్బందులతో సతమవుతోంది. దీంతో మనస్థాపం చెంది ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement