మహబూబ్‌నగర్
బోర్డుపై డాక్టర్..
సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
మహమ్మదాబాద్‌లో ఇటీవల ఆరోగ్య శాఖ చేసిన తనిఖీల్లో బీహెచ్‌ఎంఎస్ డిగ్రీ కలిగినవారు అల్లోపతి మెడిసిన్ ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారని, అలాగే ఐదుగురు ఆర్‌ఎంపీలు పెద్ద బోర్డులు ఏర్పాటు చేసుకొని ప్రాథమిక చికిత్స కాకుండా యాంటీ బాయోటిక్స్ డ్రగ్స్ వాడుతూ రోగులకు అన్ని రకాల వైద్యం అందిస్తున్నారని తేలింది. అలాగే ఒక ల్యాబ్‌తో పాటు ఎంబీబీఎస్ వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్‌లకు నోటీసులు జారీ చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఏమాత్రం నిబంధనలు పాటించని ఓ హెర్బల్ క్లినిక్‌ను సీజ్ చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎలాంటి డిగ్రీలు, పరిజ్ఞానం లేకుండా ఇలాంటి నకిలీ వైద్యులు అనారోగ్యంతో వచ్చిన రోగులకు వారి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అవగాహన లేకుండానే తోచిన ఇంజక్షన్లు, సైలెన్లు, మందులు ఇస్తున్నారు. దీంట్లో కొన్ని కేసుల్లో పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో హడావుడిగా పేరు కలిగిన ఆస్పత్రులకు రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నా ఘటనలు నిత్యం
వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


