భూత్పూర్: కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసే వారికే గుర్తింపు, పదవులు ఉంటాయని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం భూత్పూర్‌లో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా, మండల, బూత్ స్థాయిల్లో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించేందుకు అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించనున్న ఓటు చోరీ వ్యతిరేక ధర్నాకు మద్దతుగా స్థానికంగా నిరసనలు చేపట్టాలని సూచించారు. సామా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2023లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు పట్టభద్రుల ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు. ప్రత్యేక లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో 35,510 పట్టభద్రుల ఓట్లు ఉండగా, ఈసారి 50 వేలకు పెంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఓటు చోరీ వ్యతిరేక ఉద్యమం, రాజ్యాంగ పరిరక్షణలో దేవరకద్ర నియోజకవర్గం ముందుండాలని కోరారు. టీఎన్జీఓ మాజీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసిన వ్యక్తికి తన సొంత నిధుల నుంచి రూ.25 వేల బహుమతి అందజేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మిథున్‌రెడ్డి, నాయకులు అంజద్, ఎన్‌పీ వెంకటేష్, నాగిరెడ్డి, రాజు, లింగం, వినోద్‌కుమార్, జహీర్ అక్తర్, బెక్కరి అనిత, లిక్కి నవీన్‌గౌడ్, కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
నాయకులు,
కార్యకర్తల
పనితీరుపై నిఘా
సీడబ్ల్యూసీ ప్రత్యేక
ఆహ్వానితుడు
చల్లా వంశీచందర్‌రెడ్డి


