శరన్నవరాత్రి శోభ.. ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి | - | Sakshi
Sakshi News home page

శరన్నవరాత్రి శోభ.. ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల పట్టణాల్లోని పలు ఆలయాల్లో అమ్మవార్లను

విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ బస్టాండు సమీపంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం, సింహగిరిలోని

శ్రీకామేశ్వరి సమేత ఐశ్వర్యేశ్వరస్వామి ఆలయం, వాసవీ కన్యకాపరమేశ్వరి, రాజరాజేశ్వరి, చౌడేశ్వరి దేవాలయాలతోపాటు పలు ఆలయాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బ్రాహ్మణవాడిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు స్వర్ణకవచాలంకృత ఉమాదేవిగా

దర్శనమిచ్చారు. జడ్చర్ల వాసవీ ఆలయంలో అన్నపూర్ణాదేవి రూపంలో కొలువుదీరారు. ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, పూజలతో ఆధ్యాత్మిక

వాతావరణం నెలకొంది. – స్టేషన్‌ మహబూబ్‌నగర్‌/జడ్చర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement