హోరాహోరీగా ‘పంచ్‌’లు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ‘పంచ్‌’లు

Oct 11 2026 1:33 AM | Updated on Oct 11 2026 1:33 AM

● చివరిదశకు చేరిన జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

● నేటితో ముగియనున్న పోటీలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రానికి సమీపంలోని జయప్రకాశ్‌ నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో జాతీయస్థాయి సీనియర్‌ పురుషుల ఓపెన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల క్రీడాకారులు నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నారు. నేడు (ఆదివారం) జాతీయ బాక్సింగ్‌ పోటీలు ముగియనున్నాయి.

● జాతీయస్థాయి బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆయా రాష్ట్రాల క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. సెమీఫైనల్‌ మ్యాచుల్లో ఆయా రాష్ట్రాల క్రీడాకారులు గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్‌కు సంబంధించి 48 కేజీల విభాగంలో దిలీప్‌ (బీహార్‌)పై దేవేంద్రసింగ్‌ సోలంకి (రాజస్తాన్‌), 48 కేజీలో అతుల్‌కుమార్‌ (కర్ణాటక)పై ఎం.జయంత్‌ సాయిస్వరూప్‌ (ఆంధ్రప్రదేశ్‌), 54 కేజీల విభాగంలో రిశబ్‌ (పంజాబ్‌)పై హాని ఓహ్లయాన్‌ (హర్యానా), 54 కేజీలో అర్ఫాన్‌ అలీ (అసోం)పై టి.షోమర్‌జిత్‌ (కర్నాటక), 60 కేజీలో లవ్‌ప్రిత్‌సింగ్‌ (పంజాబ్‌)పై యోగేష్‌ (హర్యానా), 60 కేజీలో వివేక్‌సింగ్‌ (ఢిల్లీ)పై మోహిత్‌ ఠాకూర్‌ (యూపీ), 67 కేజీలో మనోజ్‌ రాజ్‌పుత్‌ (యూపీ)పై అంకిత్‌కుమార్‌ (హర్యానా), 67 కేజీలో సచిన్‌ (కర్ణాటక)పై సుఖ్‌దేవ్‌ (ఢిల్లీ), 75 కేజీలో రవిరావత్‌ (కేరళ)పై జయదీప్‌ రావత్‌ (ఉత్తరాఖండ్‌), 75 కేజీలో అలోక్‌కుమార్‌ (చత్తీస్‌ఘర్‌)పై సోహైల్‌ (అస్సాం), 86 కేజీలో కనై మహత (పశ్చిమబెంగాల్‌)పై పర్వ్‌ (హర్యానా), 86 కేజీలో మెలియాన్‌లి (కర్ణాటక)పై ఆకాష్‌ (పంజాబ్‌), 100 కేజీల విభాగంలో భార్గవ్‌ మణి (ఏపీ)పై కొండ జయవర్ధన్‌రెడ్డి (లక్ష్యదీప్‌) గెలుపొందారు.

చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించాలి

తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ పాల్గొనేలా ప్రోత్సహించాలని జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి.శాంతికుమార్‌ అన్నారు. జయప్రకాశ్‌ నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పురుషుల ఓపెన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ను మూడో రోజు శనివారం ఆయన పరిశీలించారు. జేపీఎన్‌సీఈలో జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీలు నిర్వహించడం కళాశాలకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, సవాళ్లను ఎదుర్కునే సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో జేపీఎన్‌సీఈ చైర్మన్‌ కేఎస్‌ రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, రఘువీర్‌సింగ్‌, రాజేంద్రకుమార్‌, నాగేశ్వర్‌, పి.శివుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement