విద్యుత్‌ చౌర్యంపై విజిలెన్స్‌ కొరడా | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చౌర్యంపై విజిలెన్స్‌ కొరడా

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

కల్వకుర్తి రూరల్‌: విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్న వారిపై విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. మంగళవారం కల్వకుర్తి విద్యుత్‌శాఖ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఊర్కొండ, కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామ శివారులోని స్ట్రోన్‌ క్రషర్‌కు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి అనధికారికంగా విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటుచేసినట్లు గుర్తించారు. అధికారుల తనిఖీ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో దాదాపు రూ. 90వేల విలువైన 8 మోటార్లు, కేబుల్‌ను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌ డీపీఈడీఈ కామేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లెల్ల గ్రామ శివారులోని క్రషర్‌కు విద్యుత్‌ అక్రమ వినియోగంపై ఇప్పటికే రెండుసార్లు దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. కల్వకుర్తి ఏడీఈ శంకరయ్య, ఏఈ జానకీరాం నాయక్‌, సలేశ్వరంగౌడ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement