పాముకాటుతో మహిళా కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళా కూలీ మృతి

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

ఇటిక్యాల: పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘ టన మంగళవారం ఇటిక్యా ల పీఎస్‌ పరిధిలో చో టు చేసుకుంది. ఎస్‌ఐ రవిరాథోడ్‌ వివరాల మేరకు.. మండలంలోని గోపల్‌ దిన్నె గ్రామానికి చెందిన లలిత (33) సోమ వారం పత్తి చేనులో పని చేస్తుండగా పాము కాటుకు గురైంది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్య లో మృతి చెందింది. మృతిరాలి తండ్రి ఎల్ల య్య ఫిర్యాదు మేరకు ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కెమికల్‌ ఫ్యాక్టరీ

కార్మికుడి మృతి

మాగనూర్‌: కృష్ణా మండలంలోని కున్సీ గ్రామానికి చెందిన త్రివిక్రమ్‌ (30) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ.. అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. త్రివిక్రమ్‌ కొంతకాలంగా కర్ణాటకలోని కడెచూర్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. కాగా సోమవారం ఫ్యాక్టరీలో విధులు నిర్వహించిన తరువాత సాయంత్రం 5గంటలకు స్వగ్రామంలోని ఇంటికి చేరు కున్నాడు. సుమారు 6 గంటలకు తనకు శ్వాస ఆడటం లేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. అప్పుడు వారు పెద్దగా పట్టించుకోకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు మళ్లీ ఆ యువకుడు శ్వాస ఆడటం లేదని, ఆయస పడటంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాయిచూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే యువకుడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సరిహద్దులో కొనసాగుతున్న కెమికల్‌ ఫ్యాక్టరీల మూలంగా గతంలో ఆలంపల్లికి చెందిన ఓ యువకుడు మృతి చెందిన విషయం మరవకముందే ఇప్పుడు మరో యువకుడి మృత్యువాత పడడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి

నారాయణపేట: విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందిన విషాద ఘ టన నారాయణపేట మండలం కోటకొండలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రా మానికి చెందిన సిరిగి నర్సమ్మ(58) రోజూలాగే వ్యవసాయ పొలంలో వరి పంటకు నీరు పెట్టేందుకు మంగళవారం పొలానికి వెళ్లింది. బోరు స్టార్టర్‌ సమీపంలో ఏపుగా పెరిగిన గడ్డిని తొలగిస్తుండగా.. తెగిపడిన సర్వీస్‌ వైర్‌ ఆమె కు తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందింది. అదే సమయంలో సమీపంలో మేకలు మేపుతున్న తిరుమలాపూర్‌కు చెందిన కొత్తపల్లి రాములు నీటికోసం అక్కడికి వెళ్లగా.. నర్సమ్మ మృతిచెంది ఉండటాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతురాలి ఇద్దరు కుమా రులు గొర్రెలకాపరులు మేపుకోసం ఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన నర్సమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి డిమాండ్‌ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీల భద్రతపై విద్యుత్‌ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు.

పొలం బాట విషయంలో రైతుల మధ్య ఘర్షణ

● ఆరగిద్దకు చెందిన 26మందిపై

కేసు నమోదు

గట్టు: మండలంలోని ఆరగిద్దలో మంగళవారం రెండు కుటుంబాలకు చెందిన రైతులు పొలం బాట విషయంలో ఘర్షణ పడగా.., ఇరువర్గాలకు చెందిన 26మందిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ అయ్యన్న తెలిపారు. ఏఎస్‌ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిందెల రవి పొలానికి వెళ్లాలంటే శంకరన్న పొలాన్ని దాటుకుని వెళ్లాలి. ఈ ఇద్దరు రైతుల మధ్య పొలం బాట విషయంలో వివాదం కొనసాగుతోంది. గతంలో పొలం బాట పంచాయితీ విషయంలో అడిషనల్‌ కలెక్టర్‌తోపాటు గట్టు తహసీల్దార్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్య పరిష్కారానికి సూచనలు చేశారు. అయితే శంకరన్న మాత్రం బిందెల రవి పొలానికి వెళ్లడానికి దారి ఇవ్వడానికి నిరాకరిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పొలం బాట విషయంలో ఇరువురు పొలం వద్ద వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో మరికొంత మంది పోగై ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో బిందెల రవి వర్గానికి చెందిన నలుగురు తిమ్మప్ప, గుడ్డెన్న, పెద్దతిమ్మప్ప, బిందెల రవి గాయపడగా.., శంకరన్న వర్గంలో ముగ్గురు రవి, సురేష్‌, కుంటెన్న గాయపడ్డారు. బిందెల రవి వర్గంలో 16మంది, శంకరన్న వర్గానికి చెందిన 10మంది మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement