మక్తల్: భార్యను హత్య చేసిన కేసులో భర్తను రిమాండ్‌కు తరలించినట్లు మక్తల్ సీఐ రాంలాల్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 30న యశోద అనే వివాహితను భర్త బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. మృతురాలి అన్న కాశినాత్ తన బావ లక్ష్మణ్ కంసాలిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సెప్టెంబర్ 7న యశోదకు మగ సంతానం జన్మించగా ఇద్దరూ కలిసి పసిపాపను విక్రయించారు. అయితే డబ్బుల విషయంలో ఇద్దరికీ రోజు గొడవ జరుగుతుండడంతో భర్త పథకం ప్రకారం భార్యను ఆటోలో బయటికి తీసుకెళ్లి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఆటో, సెల్‌ఫోన్, దుస్తులను స్వాధీనం చేసుకొని హత్య నేరం కింద కేసును నమోదు చేసి సోమవారం గుడిగండ్ల బస్టాండ్ దగ్గర లక్ష్మన్‌కంసాలిను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో మక్తల్ ఎస్‌ఐ రాజు, ఎచ్‌సి చంద్రశేకర్, శ్రీకాంత్, చంద్రశేకర్,రాజేందర్, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.


