నవాబుపేట: కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఒక వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండలంలోని పోమాల్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఈశ్వర్(35) కుటుంబ కలహాలతో సోమవారం గ్రామ సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. మంటలకు తాళలేక అరుపులు కేకలు వేయటంతో అటుగా వెళ్తున్నవారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంటలు ఆర్పి అతన్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడు ఇటీవల జిల్లా కేంద్రంలో దుస్తుల దుకాణం ప్రారంభించినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య రాణితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
వెల్దండ: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన వెల్దండ మండల పరిధిలోని దర్గా సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన అన్నవరం అనిత(40) భర్త గోపాల్‌తో కలిసి వెల్దండకు వచ్చింది. అనిత కుమారుడు వెల్దండలోని మామిడి తోటల్లో పనిచేస్తున్నా డు. అనారోగ్య కారణంగా కొంతకాలంగా ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో సోమవారం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని భర్త, కుమారుడు నిర్ణయించారు. ఆది వారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. అనంతరం అర్ధరాత్రి సమ యంలో అనిత ఎవరికీ చెప్పకుండా మామిడి తోట నుంచి రోడ్డువైపు నడుచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెంది నట్లు భావిస్తున్నారు. అనిత కనిపించకపోవడంతో భర్త గోపాల్, కుమారుడు ఆమె కోసం గాలించారు. స్వగ్రామమైన చింతలపల్లిలోనూ ఆరా తీశారు. చివరకు రోడ్డు ప్రమాదంలో మ హిళ మృతి చెందిన విషయం తెలుసుకున్నారు. సోమవారం రాత్రి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మృతదేహాన్ని పరిశీలించి అనితగా గుర్తించారు. భర్త గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగేందర్ తెలిపారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
అనుమానాస్పదంగా
మెడికల్ రిప్ మృతి
ఉండవెల్లి: మండలంలోని డి.బూడిదపాడు శివారులోని వషిష్ట విహార వెంచర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై కర్నూల్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పందగా మృతిచెందినట్లు ఎస్‌ఐ సురేష్ పేర్కొన్నారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. కర్నూలులోని వీకేర్ కాలనీకి చెందిన వెంకటేష్ (46) మెడికల్ రిప్రజెంటివ్‌గా పనిచేస్తుండేవాడు. సోమవారం ఉదయం డి.బూడిదపాడు శివారులోని వషిష్ట విహార వెంచర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై పడి ఉండగా.. ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో పరిశీలించి 100పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యలు మృతిచెందాడని నిర్ధారించడంతో పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్‌కు భార్యతో ఆరునెలల క్రితమే విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. మృతిచెందిన వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతిచెందిన చోట అనుమానాస్పదంగా పడి ఉండడంతో పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు హత్యనా.. లేక మాముల్‌గానే చనిపోయాడనేది వేచి చూడాలని పోలీసులు తెలిపారు. తండ్రి సంజన్న ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


