స్థానికులతో పాటు గుట్టకు లీజ్ అనుమతులు ఉన్న కవిత ఫిర్యాదు చేయడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు సోమవారం పెద్దగుట్టను పరిశీలించారు. సర్వేయర్ సుజాత, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్‌ఐ రాజేందర్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బ్లాస్టింగ్‌కు సంబంధించిన ఆనవాళ్లు, రాళ్ల డంపింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఫొటోలు, ఇతర వివరాలను సేకరించి పంచనామా నిర్వహించారు. అధికారులు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న మైనింగ్‌కు సంబంధించిన వ్యక్తులు యంత్రాలను రాత్రికి రాత్రే అక్కడి నుంచి తరలించినట్లు స్థానికులు అధికారులకు తెలిపినట్లు సమాచారం. గోదల్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు బ్లాస్టింగ్‌కు పాల్పడినట్లు కవిత అధికారులకు ఫిర్యాదు చేశారు.


