మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 విభాగం బాలబాలికల ఫుట్‌బాల్ ఎంపికలు నిర్వహించారు. సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు, రిటైర్డ్ ఎస్‌ఐ ప్రేమ్‌రాజ్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, సీనియర్ క్రీడాకారులు శ్రీనివాసులు, రాజు, రామకృష్ణ, ఇమ్మాన్యుయేల్ జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.


