ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారిపై ఉండవెల్లి స్టేజ్ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. టైరు అకస్మాత్తుగా పేలడంతో డ్రైవర్ లోక్‌నాథ్ అప్రమత్తమై బస్సును అదుపు చేశాడు. దీంతో బస్సు హైవే మధ్యలోని డివైడర్ వైపు దూసుకెళ్లినా ప్రమాదం జరగలేదు. ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హైవే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు క్రేన్ సహాయంతో బస్సును రోడ్డుపై నుంచి తొలగించి కర్నూలుకు తరలించారు. ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్‌కు పంపించారు.


