ప్రతిభా పురస్కారం అందుకున్న ‘కోట్ల’ | - | Sakshi
Sakshi News home page

ప్రతిభా పురస్కారం అందుకున్న ‘కోట్ల’

Oct 4 2026 10:19 AM | Updated on Oct 4 2026 10:19 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాకు చెందిన ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ కళామందిరంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతులమీదుగా కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. కవితా ప్రక్రియలో 2026 సంవత్సరానికిగాను ఆయనకు ఈ పురస్కారం లభించగా.. ప్రశంసాపత్రం, రూ.30116 నగదు పారితోషికం, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెల్దండ నిత్యానందరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు, ప్రసిద్ధ కవులు, రచయితలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement