జడ్చర్ల టౌన్: సమాజసేవ, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణలో విశిష్ట సేవలు అందిస్తున్న డా.బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.సదాశివయ్యకు బెస్ట్ సిటిజన్ ఆఫ్ సర్వీస్ ఇన్ సొసైటీ అవార్డు లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ కాస్మోపాలిటన్ ఎంప్లాయిస్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ అవార్డును ప్రదానం చేశారు. రూ.10 వేల నగదు బహుమతిని అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనను అభినందించారు.
ఒక్క లింక్.. రూ.1.65 లక్షలు మాయం
ఉండవెల్లి: మండలంలోని చిన్న ఆముదాలపాడుకు చెందిన సయ్యద్ బాషా సైబర్ వలలో చిక్కి రూ.1.65 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. యువకుడు కొంత నగదును రెండు నెలల క్రితం స్టాక్ మార్కె ట్‌లో పెట్టాడు. అది ప్రస్తుతం రూ.1.65లక్షలు కావడంతో నగదును స్టాక్ మార్కెట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు డ్రా చేయాలంటే రూ.50 ఇన్వెస్ట్ చేయాలని ఓ లింక్ పంపారు. యువకుడు ఆ లింక్‌పై క్లిక్ చేయడంతో వెంటనే నగదు మొత్తం మాయమైంది. స్టాక్‌మార్కెట్‌లో తన నగదు కనిపించకపోవడంతో గత నెల 28న సైబర్ క్రైంకు ఫిర్యా దు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.


