వ్యభిచారం కేసులో ఇద్దరికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యభిచారం కేసులో ఇద్దరికి రిమాండ్‌

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: ఇటీవల అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నడుపుతున్న ముఠాను అరెస్టు చేసిన టూటౌన్‌ పోలీసులు నిర్వాహకులను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ ఇజాజుద్దీన్‌ వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న నగరంలోని అశోక్‌టాకీస్‌ చౌరస్తా సమీపంలోని శ్రీసాయి బాలాజీ టవర్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యభిచారం నడిపే అసలు సూత్రధారి అయిన సంతోష్‌రెడ్డి పరారీలో ఉండగా.. మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఏ1 సంతోష్‌రెడ్డి, ఏ2 ఆంజనేయులు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సంతోష్‌రెడ్డిపై గతంలో మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సైతం వ్యభిచారం కేసు నమోదైందని తెలిపారు. రెండు నెలల నుంచి బాలాజీ టవర్స్‌ అపార్ట్‌మెంట్‌లో 309 ప్లాట్‌ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపిస్తున్నట్లు తేలిందన్నారు. ఇతడి స్వస్థలం నల్గొండ కాగా నగరంలో హౌజింగ్‌ బోర్డులో అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement