పాలమూరు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏడాది కాలంలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఆరోగ్యశాఖ, జనరల్ ఆస్పత్రులకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేసింది. ఉత్తమ పనితీరు కనబరిచిన బాదేపల్లి ఆర్‌బీఎస్‌కే బృందం రాష్ట్ర ఉత్తమ అవార్డు పొందగా.. నారాయణపేట జిల్లా జనరల్ ఆస్పత్రి రాష్ట్రంలోనే అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేసినందుకు రాష్ట్ర ఉత్తమ అవార్డు దక్కించుకుంది. ఈ మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సంపత్‌కుమార్ సింగ్‌కు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదార రాజనర్సింహ అవార్డు అందజేశారు.


