ముగిసిన బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బ్రహ్మోత్సవాలు

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. శ్రీరామనవమిని పురస్కరించుకొని గత నెల 26న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పక్షం రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చి సీతారామస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చివరిరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి సిర్సనగండ్ల గ్రామంలోకి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తిసుకెళ్లారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్‌ నిరంజన్‌, అర్చకులు లక్ష్మణ్‌ శర్మ, అనంత శర్మ, కోదండరామ శర్మ, మురళీధర్‌ శర్మ, ప్రవీణ్‌ శర్మ పాల్గొన్నారు.

బావాజీ ఆలయ

హుండీ లెక్కింపు

కొత్తపల్లి: దక్షిణ భారతేశంలోనే అతిపెద్ద గిరిజన పుణ్యక్షేత్రం గురులోకా మసంద్‌ బావాజీ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ సముదాయంలోని హుండీని మంగళవారం మద్దూరు పోలీసుల బందోబస్తులో మద్దూరు ఎస్‌బీఐ అధికారులు, ఎండోమెంట్‌ సిబ్బందితో లెక్కించారు. ఆలయంలో మూడు హుండీలు ఉండగా.. మొదటగా బావాజీ హుండీ లెక్కించగా 21, 20, 372, హనుమాన్‌ ఆలయ హుండీ లెక్కించగా 14, 8, 890 నగదు ఉన్నట్లు ఆలయ ఈఓ కోమల్‌ తెలిపారు. మొత్తంగా బావాజీ హుండీ, ఆంజనేయ స్వా మి హుండీ లెక్కించగా రూ.35,29, 262 వచ్చినట్లు తెలపారు. ఇంకా కాళికా దేవి ఆలయంలోని హుండీ లెక్కించాల్సి ఉందన్నారు.

కేఎల్‌ఐ కాల్వలో

బాలుడు గల్లంతు

నాగర్‌కర్నూల్‌ క్రైం: కేఎల్‌ఐ కాల్వలో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతైన ఘటన మండలంలోని పెద్దాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన పులి రవీందర్‌ (16) స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కేఎల్‌ఐ కాల్వలో ఈత పడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రవీందర్‌ కాల్వలో గల్లంతవడంతో గమనించిన స్నేహితులు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ దొరకలేదు. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement