హుండీ చోరీకి వచ్చిన వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హుండీ చోరీకి వచ్చిన వ్యక్తి అరెస్టు

Mar 24 2026 8:35 AM | Updated on Mar 24 2026 8:35 AM

కొత్తపల్లి(మద్దూరు): నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపల్‌ పట్టణంలో హుండీ దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మద్దూరు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. మద్దూరు పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఉన్న హనుమాన్‌ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి హుండీని పగలగొట్టి చోరీకి యత్నిస్తుండగా అదే సమయంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు అతని అనుమానాస్పద కదలికలను గమనించి వెంటనే పట్టుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు దామరగిద్ద మండలం మొగలమడ్కకు చెందిన అవుసుల రమేశ్‌ తండ్రి వేణుగోపాలచారిగా గుర్తించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు కొనసాగిస్తునట్లు తెలిపారు. గ్రామాల్లో చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలో డయల్‌ 100కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement