● షెడ్డులో మహిళపై ఊడి పడిన ఫ్యాన్
మెట్టుగడ్డ: మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహిళకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చిన మహిళపై ఫ్యాన్ ఊడి పడటంతో గాయాలపాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రోజు వందలాది మంది వచ్చే కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడంతో అంతా షాక్‌కు గురయ్యారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చిన కిందిగేరి స్వాతి అనే మహిళ కార్యాలయ ఆవరణలో గల షెడ్డులో కూర్చొని ఉండగా సీలింగ్ ఫ్యాన్ ఊడి మహిళపై పడటంతో భుజం, కాలికి బలమైన గాయాలయ్యాయి. గాయాలైన మహిళను కనీసం కార్యాలయ సబ్‌రిజిస్ట్రార్, సిబ్బంది యోగక్షేమాలు అడగకపోవడం వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు.


