మన్సూర్‌పల్లి బొందెగుట్ట వద్ద చిరుతలు ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాం. చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌తో అనుమతి తీసుకొని వీలైనంత వరకు మంగళవారం బోను ఏర్పాటు చేస్తాం. చిరుతలు మనుషులపై దాడులు చేయవని ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే పశువులను పొలాల వద్ద కట్టేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకై నా మంచిది ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. – రాఘవేందర్,
డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, మహమ్మదాబాద్
వారం రోజులుగా గమనిస్తున్నా..
చిరుతలు కనిపిస్తున్న బొందెగట్టు నా పొలాన్ని ఆనుకొని ఉంది. వారం రోజులుగా ఉదయం వేళల్లో మూడు చిరుతలు కనిపించాయి. పలుమార్లు రాత్రివేళల్లో కూడా కనిపించేవి. దూరం నుంచి గమనించి టార్చిలైట్ వేస్తే వెళ్లిపోయేవి. సోమవారం కనిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చా. సాయంత్రం వచ్చి చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో కూడా నా పొలం వద్దే బోనుకు చిక్కింది. మళ్లీ ఇప్పుడు మూడు చిరుతలు కనిపించడంతో భయంగా ఉంది.
– ఏదుల బాలయ్య,
రైతు మన్సూర్‌పల్లి


