ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

Mar 23 2026 9:02 AM | Updated on Mar 23 2026 9:02 AM

కృష్ణా: మండలంలోని కృష్ణానది నుంచి ట్రాక్టర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తుండడంతో ఆదివారం టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై ఏఎస్‌ఐ యాదయ్య మాట్లాడుతూ గుడెబల్లూర్‌ శివారులోని కృష్ణానది నుంచి అనుమతులు లేకుండా తిమ్మప్ప, సాయికిరణ్‌, నరసింహా, వెంకటేష్‌ ఇసుకను తరలిస్తుండడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అదే విధంగా మండలంలోని ముడుమాల్‌ గ్రామంలోని యాదవేంద్ర మఠం సమీప ప్రాంతం నుంచి సెలవు రోజు వచ్చిందంటే చాలు గ్రామంలో ట్రాక్టర్లు అన్ని కూడ కృష్ణానదిలోని ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

మాగనూర్‌: మండల పరిధిలోని నేరడగం గ్రామ పెద్దవాగు దగ్గర అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం దుప్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ నేరడగం పెద్దవాగు నుంచి ఇసుకను మక్తల్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో ముందస్తు సమాచారం మేరకు పట్టుకొని ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించామన్నారు. ఇసుక రవాణాలో నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవన్నారు.

ఇసుక డంపులు సీజ్‌

ఊట్కూర్‌: మండలంలోని సమస్తాపూర్‌ వాగు శివారులో నిల్వ చేసిన ఇసుక డంపులను ఆదివారం ఆర్‌ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంంలో సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్‌ఐ సంజీవయ్య, చెన్నకేశవులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement